నమస్తే శేరిలింగంపల్లి: వినాయక మండపాలను సందర్శించి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ అంబేద్కర్ నగర్ కు చెందిన దుర్గాబాయి, చిట్టిబాబు దంపతుల కుమారుడు ఆనంద్ కుమార్ (17) ఈ నెల 16 వ తేదీన సాయంత్రం వినాయకులను చూసేందుకు వెళ్తున్నానని ఇంట్లో తన సోదరికి చెప్పి వెళ్లాడు. రాత్రయినా ఆనంద్ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కలా ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 17 వ తేదీన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో తమ కుమారుడు కనబడడం లేదని దుర్గాబాయి, చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి ఆచూకీ తెలిసినవారు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.