నమస్తే శేరిలింగంపల్లి: రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్ జెండర్ మృతిచెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వైజాగ్ కు చెందిన సుధాకర్ అలియాస్ మౌనిక (24) అనే ట్రాన్స్ జెండర్ స్నేహితురాలితో కలిసి వెళ్తుండగా ఖాజాగూడ కొత్త రోడ్డు వద్ద ఈఎస్ సీఐ గేటు ముందు స్కిడ్ అయి తీవ్ర గాయాలకు గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. మౌనికను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు.
