ఘనంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు – ఆలయాల్లో పూజలు, వార్డు కార్యాలయంలో రక్తదాన శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తారానగర్ తుల్జాభవాని అమ్మవారి దేవాలయంలో, రాజీవ్ గృహకల్పలోని సాయిబాబా మందిరంలో రాగం నాగేందర్ యాదవ్ పేరుమీద ప్రత్యేక పూజలు చేయించారు.

శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తుల్జా భవాని ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

వార్డు కార్యాలయ ఆవరణలో మహావీర్ ఇంటర్నేషనల్ సైబరాబాద్ సెంటర్ మార్వారి యువ మంచ్ సికింద్రాబాద్ బ్రాంచ్ మనీష్ నహర్, మనోజ్ జైన్, ప్రదీప్ తివారి టీం ఆధ్వర్యంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మొత్తం 248 మంది ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం జన్మదిన కేకును అభిమానులు, కార్యకర్తలు‌ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దుర్గం వీరేశం గౌడ్, గుర్రపు రవీందర్ రావు, సోమదాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాంచందర్, బేరి రాంచందర్ యాదవ్, వార్డు మెంబర్లు శ్రీకళ, కవిత, పర్వీన్ బేగం, ఆయా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, అసోసియేషన్ సభ్యులు, ఏరియా కమిటీ, బూత్ కమిటీ మెంబర్లు, ఆర్ ఎన్ వై యూత్ అసోసియేషన్ సభ్యులు, శ్రేయోభిలాషులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాగం నాగేందర్ యాదవ్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తున్న అభిమానులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here