శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటి నుంచి బయటకు ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన లక్కీ (9) మెట్రో దగ్గర ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అతని తండ్రి మహేష్ చుట్టు పక్కల, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద లక్కీ ఆచూకీ కోసం విచారించాడు. అయినా ఫలితం లేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆ బాలుడికి చెవులు వినపడవని, మాటలు కూడా రావని ఎవరైనా గుర్తు పడితే 8712663179, 8106679004 అనే నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.