నమస్తే శేరిలింగంపల్లి: సెంట్రింగ్ గోడౌన్ లో పనిచేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషను పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్ పోలోసుల కథనం ప్రకారం సంపత్ (51) అనే వ్యక్తి మియాపూర్ ఆదిత్య నగర్ లో సెంట్రింగ్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. సెంట్రింగ్ సామాన్లు ఉంచే గోడౌన్ లోని సెక్యూరిటీ రూంకు వెళ్లి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి కూలీల్లో ఒకరు రూం తలుపు తెరవడంతో సంపత్ కరెంట్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. మృతునికి బంధువులు, మిత్రులు ఎవరూ లేకపోవడంతో గోడౌన్ సూపర్ వైజర్ కిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.