స్వచ్ఛంద సంస్థల సహాకారంతో మజీద్ బండ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య

నమస్తే శేరిలింగంపల్లి: అండర్ ప్రివిలైజ్డ్ స్టూడెంట్స్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రామ్ పేరిట ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ విద్య అందించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే శనివారం మసీద్ బండ జిల్లా పరిషత్ హై స్కూల్ లో డిజిటల్ స్మార్ట్ బోర్డ్ ప్రారంభించి వర్క్ బుక్స్ ను జి వై ఫౌండేషన్ చైర్మన్, మంజీరా కన్ స్ట్రక్షన్ అధినేత గజ్జల యోగానంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ పట్టుదల ఉంటే విజయం సొంతమవుతుందని అన్నారు. గజ్జల యోగానంద్ స్కూల్ కి డిజిటల్ ఇంటరాక్టివ్ బోర్డ్ అందజేశారు. 2డి, 3డి యానిమేషన్లతో కూడిన డిజిటల్ కంటెంట్ ను 5మంత్ర లెర్నింగ్ అకాడమీ కో స్పాన్సర్ చేసింది. విద్యారంగంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేయబోతున్నట్టు ఆ సంస్థ అధినేత యెన్నం శ్రీనివాసరెడ్డి చెప్పారు.

మజీదు బండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

డిజిటల్ సెల్ఫ్ లెర్నింగ్ బుక్స్ ను విద్యార్థులకు అందించారు. లైఫ్ సైకిల్ యాప్ సృష్టికర్త దీనానాథ్ యూపీ స్టెప్ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాణ్ స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు మరో ప్రభుత్వ స్కూల్ కి డిజిటల్ బోర్డ్ అందచేయనున్నట్టు ప్రకటించారు. ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి చొరవతో యూపీ స్టెప్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. యానిమేషన్ల సాయంతో పాఠాలు చెప్పే ఈ పద్ధతి మున్ముందు మరెన్నో ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేందుకు 5మంత్ర లెర్నింగ్ అకాడమీ కృషిచేస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, కిరణ్ కుమార్, అశోక్, సుధీర్, శ్రీకాంత్, పద్మజ, బిందు, హై స్కూల్, హెడ్ మాస్టర్ అనంత్ రెడ్డి, లైఫ్ సైకుల్ ప్రతినిధి దీనానాధ్, సుధీర్, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు మయూర్, ప్రవేష్ తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ స్మార్ట్ బోర్డును ప్రారంభిస్తున్న గజ్జల యోగానంద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here