ప్రేయ‌సి గొంతుకోసి-ప్రియుడు ఉరి వేసుకుని… మాదాపూర్ లెమ‌న్ ట్రీ హోట‌ల్‌లో ప్రేమ జంట మృతి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్‌లోని లెమ‌న్ ట్రీ హోట‌ల్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేయ‌సి గొంతు కోసిన ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. స్థానికంగా తీవ్ర సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మాదాపూర్ ఏసీపీ ర‌ఘునంద‌న్ రావు తెలిపిన వివ‌రాల ప్రకారం… వికారాబాద్ జిల్లా బొమ్మ‌రాజ్‌పేట్ మండ‌లం హ‌కీంపేట గ్రామానికి చెందిన‌ రాములు(25) బుధ‌వారం మ‌ధ్యాహ్నం మాదాపూర్ లెమ‌న్ ట్రీ హోట‌ల్‌లో రూమ్ బుక్ చేశాడు. త‌న‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సంతోషి(25) అనే యువ‌తిని వెంట తెచ్చుకున్నాడు. ఇద్ద‌రు ఒక రోజంతా హోట‌ల్‌లో గ‌డిపారు. గురువారం మ‌ధ్యాహ్నం హోట‌ల్ చెక్ అవుట్ చేయాల్సి ఉండ‌గా ఇంకొక రోజు ఉంటాంమంటూ హోట‌ల్ రూం బుకింగ్‌ను పొడ‌గించుకున్నారు. ఐతే రాములు, సంతోషలు గొడ‌వ ప‌డ‌టాన్నిహోట‌ల్ సిబ్బంది గుర్తించారు. ఆ త‌ర్వాత లోప‌లి నుంచి ఎలాంటి శ‌బ్ధాలు రాక‌పోవ‌డం, త‌లుపు కొట్టిన తెరువ‌క పోవ‌డంతో హోట‌ల్ సిబ్బంది తాళం ప‌గుల‌గొట్టి చూడ‌గా సంతోష గొంతు తెగి బాత్‌రూమ్‌లో ప‌డి ఉండ‌గా, రాములు ఫ్యాన్‌కు ఉరికి వేళాడుతూ ద‌ర్శ‌న‌మిచ్చారు. దీంతో మాదాపూర్ పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు.

గొంతు తెగి ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిఉన్న సంతోషి, ఉరికి వేళాడుతున్న రాములు

నెల క్రిత‌మే పెళ్లి చేసుకున్నారు..?
రాములు, సంతోషిలు 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్థానికంగా క‌ల‌సి చ‌దువుకున్నార‌ని, ఈ క్ర‌మంలో వారిరువురు ప్రేమించుకున్నార‌ని పోలుసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఐతే వారు నెల క్రితం పెళ్లి చేసుకున్నార‌ని, ఐతే ఇరు ప‌క్షాల సామాజిక వ‌ర్గాలు వేరు అవ్వ‌డంతో వారి వారి కుంటుంబ స‌భ్యులు అందుకు అంగీక‌రించ‌లేరు. దీంతొ రాములు, సంతోష ఇద్ద‌రు న‌గ‌రంలో ఉంటున్నార‌ని స‌మాచారం. రాములు త‌న రెండు కార్లు అమ్మేసి ఇటీవ‌లే ఒక జేసీబీ తీసుకోగా, సంతోషి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటుంది. ఐతే కుటుంబాల‌కు దూర‌మైన నేపంతో ఒక‌ర‌పై ఒక‌రు దూషించుకున్నార‌ని, ఈ క్ర‌మంలోనే బ్లేడ్‌తో సంతోష గొంతుకోసిన రాములు, ఆ త‌ర్వాత తానూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని తెలుస్తుంది. మృతుల కుటుంబ సభ్యుల‌ విచారణ పూర్త‌వుతే అస‌లు విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌నున్నాయి.

రాములు, సంతోషి(ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here