బిజెపి‌‌ నాయకుల ముందస్తు అరెస్టు

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి బిజెపి నాయకులు వెళ్తున్నారని ఇంటెలిజన్స్ వర్గాల సమాచారం మేరకు మియపూర్ పోలీసులు గురువారం ఉదయమే శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. బిజెవైయం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నయా నిజాం నవాబ్ లా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా , హుజురాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా కొత్తకొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బిజెపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని సార్లు అరెస్టులు చేసినా తెలంగాణ ప్రజల తరపున బిజెపి నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. అరెస్టు అయిన వారిలో బిజెపి జిల్లా నార్త్ సెల్ కన్వీనర్ రాజ్ జైశ్వాల్ , బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు చందు, నాయకులు శివ , అశోక్ ముదిరాజ్ , గుండె రాజశేఖర్ ముదిరాజ్ ఉన్నారు.

ప్రగతి‌భవన్ ముట్టడికి వెళ్లకుండా బిజెపి నాయకులను అరెస్టు చేసిన దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here