నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి ని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని వారి కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంస్థాగతమైన, ప్రజా సంబంధ అంశాలపై వారు చర్చించారు. కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డికి ప్రాతినిధ్యం లభించడం తెలంగాణ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.