నిత్య చైతన్య స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద- బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: సనాతన భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తత్వవేత్త, నిత్య చైతన్య స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానందుడని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. వివేకానందుని 159 వ జయంతి సందర్భంగా మదీనగూడ, మైత్రీ నగర్ కాలనీ లోని స్వామి వివేకానంద విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప తాత్వికుడని, ఆయన బోధనలు అద్వైత వేదాంతం తత్త్వ శాస్త్రములోనే కాకుండా, సామాజికంగా, రాజకీయంగాఉపయోగపడుతాయని అన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి హిందూ సన్యాసి భారతదేశ ప్రత్యేకతను చాటడానికి కృషి చేసిన యోగి స్వామి వివేకానందుడని తెలిపారు. యువత విశ్వాసం, నమ్మకంతో ఏదైనా కార్యాన్ని ప్రారంభించాల‌ని చెప్పారు. భయాన్ని వదిలేయాలని భయమే పెద్ద పాపమని అన్నారు‌. మీరు మందలో ఉండకుండా వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగానంద్, జ్ఞానేంద్ర ప్రసాద్, నాగేశ్వర్ గౌడ్, బుచ్చి రెడ్డి, శ్రీధర్ గౌడ్, శ్రీశైలం కురమ, లక్ష్మణ్, రమేష్ రెడ్డి, గణేష్, శ్రీను, రాము, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here