మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాదాపూర్‌లోని చంద్రనాయక్ తండాలో నివాసం ఉండే దేవవత్ జయశ్రీ (26) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా ఆమెకు 12 ఏళ్ల కిందట వివాహం అయిందని, ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె తండ్రి బనావత్ చందర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
