నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి, పీఏ నగర్, దీప్తి శ్రీ నగర్, కేఎస్ఆర్ ఎన్ క్లేవ్, శాంతి నగర్ కాలనీలలో చందానగర్ సర్కిల్ డీసీ సుధాంష్, ఆయా శాఖల అధికారులు, స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాదయాత్ర చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, దీప్తి శ్రీ నగర్ లో అసంపూర్తిగా మిగిలిన నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పీఏ నగర్ లో స్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తామని చెప్పారు. రాజకీయలకతీతంగా అభివృద్ధి చేశామని, రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి సమస్య లేకుండా చూశామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఏఈ రమేష్, జలమండలి జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సాయి చరిత, సునీత ఏఎంఓహెచ్ కార్తిక్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, ఎలక్ట్రికల్ ఏఈ రాజ్ కుమార్, ఎస్ ఆర్ పీ కనకరాజు, బాలాజీ, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు జనార్దన్ రెడ్డి , వెంకటేష్ ముదిరాజ్, దాసరి గోపి, గుడ్ల ధన లక్ష్మి, పీవై రమేష్, పులిపాటి నాగరాజు, రవీందర్ రెడ్డి, ఓ.వెంకటేష్, గోవర్ధన్, మల్లేష్,అక్బర్ ఖాన్, దాస్, ఇమ్రాన్, ప్రవీణ్ రెడ్డి, హరీష్, యశ్వంత్, ఖాధర్, కుమార్, అల్తాఫ్, సందీప్ రెడ్డి, వరలక్ష్మి, పార్వతి, కాలనీ వాసులు సీతారామయ్య, దేవేందర్ రెడ్డి పూర్ణచంద్రరావు, చంద్రశేఖర్, రాజు, సత్యనారాయణ, వెంకట్, రమణ, వెంకట్ రెడ్డి, రామచంద్ర, సురేష్, భిక్షపతి, సరోజిని, భీమమ్మ, లింగారెడ్డి, రాజ్ కుమార్, శ్రీనివాస్, జె వి రావు,కృష్ణయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.