నమస్తే శేరిలింగంపల్లి: భార్యభర్తల మధ్య గొడవలు, మద్యానికి బానిసగా మారిన భర్త మద్యం మత్తులో అర్థరాత్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వెస్ట్ బెంగాల్ మల్దా జిల్లాకు చెందిన సుశిల్ మండల్ (29), భార్య పరుల్ మండల్ బ్రతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి ఖానామెట్ జేఎంసీ లేబర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి సుశిల్ మండల్ మద్యానికి బానిసగా మారి పనికి వెళ్లకుండా రోజూ మద్యం తాగి వస్తున్నాడు. ఈ నెల 6 వ తేదీన మద్యం కోసం భార్యను డబ్బులు అడగ్గా ఇద్దరికి గొడవ జరిగింది. 8 వ తేదీన రాత్రి 9 గంటల డ్యూటీకి వెళ్తున్నానని బయటకు వెళ్లి మద్యం సేవించి రాత్రి 11 గంటలకు వచ్చాడు. భార్యతో గొడవలు, మద్యానికి బానిసగా మారిన సుశిల్ మండల్ మద్యం మత్తులో అదే రోజూ అర్థరాత్రి కాలనీలోని చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో చూసిన కాలనీ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే మృతిచెందాడు. మృతుని భార్య పరుల్ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
