కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం – మోడీపై చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: అమర్నాథ్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ‌కేసీఆర్ చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బిజెవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ అమర్నాథ్ యాదవ్ డిమాండ్ చేశారు. బిజెపి, బిజెవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బిజెవైఎం మియాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా బిజెవైఎం, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెవైఎం, బిజెపి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను మియాపూర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేసీఆర్ చేసిన వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ జితేందర్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు మానిక్, బిజెవైఎం డివిజన్ జనరల్ సెక్రటరీ బాలు, హర్షిత్, సాయికిరణ్, మహేష్, సిద్దూ, బిజెపి,‌ బిజెవైఎం నాయకులు పాల్గొన్నారు.

మియాపూర్ చౌరస్తా లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న బిజెవైఎం ‌నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here