నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ తెలిపారు. బిజెపి బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని హజీపేట్, హణీఫ్ కాలనీలలో ఆదివారం మారబోయిన రఘునాథ్ యాదవ్ బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్తీ బాటలో ప్రజల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్డు, నాలా, మంచి నీటి, స్ట్రీట్ లైట్స్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను జోనల్ కమిషనర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోపాల కృష్ణ, చారీ, డివిజన్ జనరల్ సెక్రటరీ రాజు, డివిజన్ మెంబర్ సాయి, బిజెవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రశాంత్,కృష్ణ, రంజిత్, అజయ్, జీవన్, అరవింద్, పద్మ, మధు, షరీప్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
