- మండల కేంద్రాలలో ధర్నా..
- కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
- పేపర్ లీక్స్ పై కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి ఉద్యమం
నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో పాలన అద్వాన్నంగా మారింది.. ఉద్యోగాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో సరైన న్యాయం జరగడం లేదని దశాబ్దాల పాటు యువత పోరాటం చేశారు. జీవితాలను త్యాగం చేసి ఉద్యమిస్తే తల్లి సోనియమ్మ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.
కానీ కేసీఆర్, కేటీఆర్ పాలనలో తెలంగాణ లో ఉద్యోగ నియామకాలు అపహాస్యంగా పరిణమించాయని జెరిపేట జైపాల్ ఆధ్వర్యంలో దర్బాలు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల్లో అడ్డగోలు అవినీతి, డబ్బులకు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని,
తాజాగా టీపీపీఎస్సి టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రాల లీక్ ప్రభుత్వ నిర్లక్షానికి పరాకాష్ట అని మండిపడ్డారు. కేటీఆర్ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు.