శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థులు వీరే…?

బిక్షపతియాదవ్ రాజీనామా అనంతరం రేవంత్ రెడ్డి తో చర్చిస్తున్న మహిపాల్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటం తో రాజకీయపార్టీలు ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో రాత్రికి రాత్రి ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్, నియోజక వర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ లు బిజెపి లో చేరుతుండగా పలువురు మైనారిటీ, యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారయ్యింది. ఈ క్రమంలోనే పార్టీతోనే కలిసి నడవనున్న నాయకులు గాంధీ భవన్ లో పార్టీ అధినేతలతో భేటీ అయ్యారు. పార్టీలో మిగిలి ఉండే నాయకులతోనే కాంగ్రెస్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోరాడేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే నియోజక వర్గంలో కొండాపూర్ డివిజన్ అభ్యర్థిగా మహిపాల్ యాదవ్ పేరు ఖరారు కాగా మిగిలిన తొమ్మిది డివిజన్లలో ఎనిమిది డివిజన్లకు పలువురు నాయకుల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. పోటీలో నిలబడే అభ్యర్థులుగా క్రింది పేర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గాంధీ భవన్ లో టిపిసిసి నాయకులు పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లతో సమావేశమైన మహిపాల్ యాదవ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు

పార్టీ పరిశీలనలో ఉన్న నాయకుల పేర్లు ఇవే..
శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ బాధ్యతలు ఎవరు చేపడతారు అనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేకున్నప్పటికీ సమయాభావం వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్టానం వేగవంతం చేసింది. కొండాపూర్ డివిజన్ అభ్యర్థిగా మహిపాల్ యాదవ్ ఇదివరకే ఖరారవ్వగా, మియాపూర్ డివిజన్ అభ్యర్థిగా ఇలియాజ్ షరీఫ్, హఫీజ్ పేట్ డివిజన్ అభ్యర్థిగా రేణుక, మాదాపూర్ డివిజన్ అభ్యర్థిగా అల్లావుద్దీన్ పటేల్, చందానగర్ డివిజన్ అభ్యర్థిగా సీమా బేగం, శేరిలింగంపల్లి డివిజన్ అభ్యర్థిగా శ్రీహరి గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ అభ్యర్థిగా నాగమణి, హైదర్ నగర్ డివిజన్ అభ్యర్థిగా సీతారామ రాజులు బరిలో నిలువనున్నట్లు సమాచారం. మిగిలిన ఆల్విన్ కాలనీ డివిజన్ నుండి ఎవరికి అవకాశం ఇస్తారనే విషయం లో స్పష్టత లేదు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here