నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ బొల్లారం చౌరస్తా వద్ద, నిరంతర పోరాట యోధుడు, అనితర సాద్యుడు, నవ తెలంగాణ నిర్మాత, కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సందర్భంగా, వారికి మద్దతుగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు కార్యకర్తలు వారి చిత్ర పట్టానికి క్షీరాభిషేకం చేసి, బాణ సంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తెరాస నాయకులు మాట్లాడుతూ తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దారో .. దేశం కోసం కూడా కెసిఆర్ లాంటి నాయకుని కోసం ఎదురుచూస్తున్నారని, దేశ ప్రజలకు ప్రతినిధిగా కెసిఆర్ ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ కెసిఆర్ కు హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెరాసా నాయకులు ముప్పవరపు గంగాధర్ రావు, BSN కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజ్, చంద్రిక ప్రసాద్, గోపరాజు శ్రీనివాస్ రావు, సుప్రజా, మహమ్మద్ ఖాజా, నరేందర్ ముదిరాజ్, గోల్కొండ తిమ్మరాజు, శివ ముదిరాజ్, వెంకటేష్, రని, ఉమకిషన్, అబ్రహం, సతీష్ , కాంతారావు, దేవేందర్, ముస్తఫా, శాంతి కుమార్, శ్రీను, వినోద్ సాగర్ పాల్గొన్నారు.
మియాపూర్ బొల్లారం చౌరస్తా వద్ద సీఎం కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు