శేరిలింగంప‌ల్లిలో ఘనంగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు 67వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కెసిఆర్ జీవిత విశేషాల‌తో రూపొందించిన పుస్త‌కాన్ని విడుద‌ల చేశారు. అనంత‌రం కేకు క‌ట్ చేసి త‌మ ప్రియ‌త‌మ నేత‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మొక్క‌లు నాటారు.

మియాపూర్‌లోని క్యాంపు కార్యాల‌యంలో పార్టీ శ్రేణుల‌తో క‌లిసి మొక్క‌లు నాటుతున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ

మియాపూర్‌లో…
మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌భుత్వ విప్ గాంధీ కార్పొరేట‌ర్లు వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, వి.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌, రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌, మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి, మాధ‌వ‌రం రోజా రంగార‌వు, నార్నె శ్రీ‌నివాస్‌, దొడ్ల వెంక‌టేశ్ గౌడ్‌, హ‌మీద్ ప‌టేల్ లతో క‌లిసి కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. అనంత‌రం కేకు క‌ట్ చేసి కెసిఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ వేడుక‌ల్లో నాయ‌కులు ర‌ఘునాథ్ రెడ్డి, గుడ్ల ధ‌న‌లక్ష్మి, మిరియాల రాఘ‌వ‌రావు, సుప్ర‌జ ప్ర‌వీణ్‌, బ‌ద్దం కొండ‌ల్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

హుడా కాల‌నీలో ఎక్సైజ్ సిఐ గాంధీతో క‌లిసి మొక్క‌లు నాటుతున్న కార్పొరేట‌ర్లు పూజిత‌జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్, జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

హ‌ఫీజ్ పేట్ డివిజ‌న్‌లో…
హ‌ఫీజ్ పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని ఆర్టీసి కాల‌నీలో స్థానిక కార్పొరేటర్లు వి.పూజిత, జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ ల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా చందనగర్ ఎక్సైజ్ సి.ఐ గాంధీ హ‌జ‌రై స్థానికంగా గ‌ల మ‌ల్ల‌య్య కుంట లో మొక్క‌లు నాటారు.
ఈ కార్యక్రమంలో నాయ‌కులు కార్తిక్ గౌడ్, వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, జ్ఞానేశ్వర్, రమేష్ గౌడ్, దేవేందర్,చంద్ర శేఖర్, పద్మ రావు, రామ్ కుమార్ యాదవ్, రాజేశ్వర్ గౌడ్, బాల సుబయ్య, నరేందర్ బల్లా, రాజు యాదవ్, సత్యనారాయణ, మహిళలు పద్మ, శిరీష, రేణుక, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో కేకు క‌ట్ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు మంజుల ర‌ఘునాథ్ రెడ్డి, వి.పూజిత జ‌గదీశ్వ‌ర్‌గౌడ్, వి.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

గంగారంలో…
హ‌ఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని గంగారాంలో నిర్వ‌హించిన కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జ‌గదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో భాగంగా మొక్క‌లు నాటుతున్న మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబ‌

గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో…
గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలో గ‌ల నాన‌క్ రాంగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. అనంత‌రం ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయ‌కుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ నాయ‌కులు కార్య‌కర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటుతున్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బోర్డ్ చైర్మన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేట‌ర్ నాగేంద‌ర్ యాద‌వ్‌

శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లో…
ముఖ్య‌మంత్రి కెసిఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని దేవినూర్ ఆసుపత్రిలో స్థానిక కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో కొటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆసుపత్రి ఆవ‌ర‌ణ‌లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బోర్డ్ చైర్మన్ రాగం సుజాత యాదవ్ తో క‌లిసి రాగం నాగేంద‌ర్ యాద‌వ్ మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ఎస్ యువ నాయ‌కులు రాగం అనిరుధ్ యాదవ్, నాయ‌కులు శ్రీకల, సందయ్య నగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు బస్వరాజు, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, అలీ, చంద్రకళ, శశికళ, రామచంద్రు, జమ్మయ్య, దివాకర్ రెడ్డి, జి.సుజాత, రాజు, సుజాత, జయ, శ్రీలత త‌దిత‌రులు పాల్గొన్నారు.

కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో కేకు క‌ట్ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి లు

చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో…
చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని శ్రీ‌రామ్ న‌గ‌ర్ కాల‌నీలో ముఖ్య‌మంత్రి కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజ‌రై మొక్క‌లు నాటారు. అనంత‌రం కేకు క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పేద మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, మిరియాల రాఘ‌వ‌రావు త‌దిత‌రులు

మిరియాల రాఘ‌వ‌రావ్ చారిట‌బుల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో…
ముఖ్య‌మంత్రి కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను మిరియాల రాఘ‌వ‌రావు చారిట‌బుల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో చందాన‌గ‌ర్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథులుగా హాజ‌రైన ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డిలు ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కులు రాఘ‌వ‌రావు, మిరియాల ప్రీత‌మ్‌ల‌తో క‌లిసి కేకు క‌ట్ చేశారు. అనంత‌రం పేద ప్రజలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో డివిజ‌న్ నాయ‌కుల‌తో క‌లిసి కేకు క‌ట్ చేస్తున్న హ‌మీద్ ప‌టేల్‌

కొండాపూర్‌లో…
ముఖ్యమంత్రి కెసిఆర్ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా కొండాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్ నివాసంలో వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హ‌మీద్ ప‌టేల్ డివిజ‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి కేకు క‌ట్ చేశారు. అనంత‌రం గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా గోల్డెన్ తులిప్ పార్క్‌లో మొక్క‌లు నాట‌రు. దీంతో పాటు కొండాపూర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో రోగుల‌కు పండ్లు పంపిణీ చేశారు. ఈ వేడుక‌ల్లో డివిజ‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

ఆసుప‌త్రిలో రోగుల‌కు పండ్లు పంపిణీ చేస్తున్న టిఆర్ఎస్ నాయ‌కులు

కొండాపూర్ ఆసుప‌త్రిలో పండ్ల పంపిణీ…
ముఖ్య‌మంత్రి కెసిఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని టిఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు గుర్ల తిరుమ‌లేష్ ఆధ్వ‌ర్యంలో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దశరథ్ , కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, ఏరియా కమిటీ మెంబర్ తిరుపతి యాదవ్, సీనియర్ నాయకులు చీరల కృష్ణ సాగర్, బలరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు


చిన్నారుల‌కు పండ్లు పంపిణీ చేస్తున్న రంజిత్ అన్న యువ‌సేన నాయ‌కులు

రంజిత్ అన్న యువ‌సేన ఆధ్వ‌ర్యంలో…
ఎంపి రంజిత్ అన్న యువ‌సేన ఆధ్వ‌ర్యంలో ముఖ్య‌మంత్రి కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను శేరిలింగంప‌ల్లి లో గ‌ల శిశు మంగ‌ల్ అనాథాశ్ర‌మంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా యువ‌సేన అధ్య‌క్షులు క‌ట‌కం రామ్ మొక్క‌లు నాటి, చిన్నారుల‌కు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మైనారిటీ నాయకులు జహీరుద్దీన్, టిఆర్ఎస్‌ యువ నాయకులు జెంషేడ్ రవి, కార్తిక్ కిరణ్, లక్ష్మణ్, శ్రీనివాస్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here