చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల్లో చందానగర్ డివిజన్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దీప్తిశ్రీనగర్ కు చెందిన బిజెపి నాయకులు నాగం రాజశేఖర్ పార్టీ రంగారెడ్డి జిల్లా(అర్బన్) అధ్యక్షులు సామ రంగారెడ్డికి బయోడేటాను సమర్పించారు. మూడున్నర దశాబ్దాలుగా బిజెపి పార్టీలో కార్యకర్తగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఎబివిపి, బిజెవైఎం నాయకుడిగా, మధురనగర్ యూత్ ప్రెసిడెంటుగా పని చేసిన అనుభవం తనకు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కో కన్వీనర్ గా, దీప్తిశ్రీ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా, పలు ఎన్జీఓలలో సభ్యుడిగా, ఆరెస్సెస్ కార్యకర్తగా కొనసాగుతున్నట్లు తెలిపారు. తాను అయోధ్య రామ మందిర్ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం లో, ఆర్టికల్ 370 వ్యతిరేక ఉద్యమాలలో పోరాటం చేశానని తెలిపారు. వీటితో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో సైతం తన బాధ్యతను నిర్వర్తించినట్లు పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ లో తనకు మంచి పట్టు ఉందని, ఈ డివిజన్ మహిళలకు కేటాయించిన కారణంగా రాబోయే ఎన్నికల్లో తన భార్య నాగం వేదవతికి కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు.