గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో గచ్చిబౌలి బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ బిజెపి గచ్చిబౌలి డివిజన్ మాజీ అధ్యక్షుడు నక్క నరేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా(అర్బన్) బీజేపీ ప్రెసిడెంట్ సామా రంగారెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ తాను పార్టీలో చేపట్టిన బాధ్యతలు, కార్యక్రమాలతో కూడిన బయోడేట ను అందజేశారు. బిజెపి పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి తాను ఎంతగానో కృషి చేసినట్లు తెలిపారు. పార్టీ ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ అప్పగించిన ప్రతీ కార్యక్రమాన్ని నిబద్దతతో పూర్తి చేసినట్లు వివరించారు. గచ్చిబౌలి డివిజన్ లో కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం కల్పిస్తే గెలిచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.