సదర్ ఉత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి: భేరి

కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్, అంజయ్యనగర్ శ్రీ మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్, అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సదర్ ఉత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని, రాష్ట్రమంతటా ప్రభుత్వ ఖర్చుతో సదర్ పండుగను నిర్వహించాలని భేరి రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. అప్పల గణేష్ యాదవ్, వినోద్ యాదవ్, కుమార్ యాదవుల నేతృత్వంలో జరిగిన సదర్ ఉత్సవాల్లో అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్, కోకాపేట్ కౌన్సిలర్ దుర్గేష్ యాదవ్, స్థానిక నాయకులు గంగుల మహిపాల్ యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గంగుల చంద్రశేఖర్ యాదవ్, సిద్దిక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, యాదవ సంఘం పెద్దలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న హమీద్ పటేల్, భేరి రామచందర్ యాదవ్, అందెల కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here