సమాజ సేవ అదృష్టంగా భావించాలి : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • ఆర్ .కే .వై ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
  • పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేత
ఆర్ .కే .వై ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, అనంతరం మజ్జిగ పంపిణి చేస్తున్న దృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ పటేల్ కుంట పార్క్ ఎదురుగా బిజెపి పార్టీ కార్యాలయ ఆవరణలో ఆర్. కే .వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ప్రారంభించారు, అనంతరం షంషీగూడ, ఎల్లమ్మ బండ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆర్ .కే .వై ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలను, పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నా సామాజిక సేవ కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల అప్పుడే కాకుండా మానవత దృక్పథంతో పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ వంతు కృషిగా మా ట్రస్టు ద్వారా, ఆర్ కే వై ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను శేరిలింగంపల్లి నియోజకవర్గం లో చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మణిభూషణ్, నర్సింగ్ రావు యాదవ్, నరసింహ చారి, భూపాల్ రెడ్డి, శ్రావణి , పద్మ, నర్సింగ్ రావు, నవీన్ గౌడ్, గోపాల్ రావు, సీతారామరాజు, ఆంజనేయులు యాదవ్, సాయి, సురేష్, సందీప్, రమేష్, శ్రీలత రెడ్డి, దేవి రెడ్డి, జయశ్రీ, రేణుక, కళ్యాణ్, విష్ణు, సాయి పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here