నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిహెచ్ ఎంసీ అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీలో జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు. కాలనీలో పార్కును అభివృద్ధి చేయాలని కాలనీవాసులు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో పార్కును త్వరలోనే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తిర్చిద్దాడనికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాలనీ వాసులు, బిఆర్ఏస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిహెచ్ ఎంసీ అధికారులు పాల్గొన్నారు.