సెంట్రల్ వర్సిటి హెడ్ కుక్ పదవీ విరమణ-అఖిల భారత యాదవ మహాసభ సత్కారం
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ విభాగం హెడ్ కుక్ బుచ్చయ్య యాదవ్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ఆద్వర్యంలో పదవీ విరమణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని బుచ్చయ్య యాదవ్, జానకమ్మ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బుచ్చయ్య యాదవ్ ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సెంట్రల్ యూనివర్సిటిలో వంటవాడిగా చేరి నేడు హెడ్ కుక్ స్థాయికి ఎదిగారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల సహకారంతో స్థానికంగా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారని అన్నారు. తోటి ఉద్యోగస్తుల కష్టసుఖాలలో పాలుపంచుకున్న బుచ్చయ్య ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ యూనియన్ అధ్యక్షులు దానబోయిన పరుశురాం యాదవ్, గౌరవ అధ్యక్షులు కే నరసింహ యాదవ్, పాండు యాదవ్, రాములు, హనుమంతు, శ్రీశైలం, బి అంజయ్య, నారాయణ, సాకలి నరేందర్, రజక సంఘం అధ్యక్షులు నరేందర్, శ్రీశైలం, రాజు యాదవ్, కే రాము యాదవ్, హెచ్ సీయూ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు పాల్గొని బుచ్చయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.