చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ఆర్.వి.ఎస్. మాధవ బృందావనం అపార్ట్ మెంట్ లో శనివారం స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ రహదారిపై పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందిగా ఉందని, వాకర్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని కోరారు. అపార్ట్మెంట్ వెనుక వైపు సి.సి రోడ్ లేకపోవడం తో పాటు డ్రైనేజీ సమస్య వలన వర్షకాలంలో ఇబ్బందులు గురయ్యామని కార్పొరేటర్ చొరవతో సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నవతరెడ్డి మాట్లాడుతూ డివిజన్ బాట లో భాగంగా అపార్ట్మెంట్ వాసుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ శనివారం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. కారోనా విషయంలో అపార్ట్మెంట్ వాసులు ఎవ్వరూ భయబ్రాంతులకు గురికావద్దు అని,కారోనా వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు, తగుజాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఎవరు పడితే వారు ఇచ్చే రకరకాల మందులు వాడి అనారోగ్యాల పలు కావద్దని, ఎవారికైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు,అపార్ట్మెంట్ వాసులు, తదితరులు పాల్గొన్నారు.