- పూర్తిగా దగ్ధమైన కారు
- ఆలస్యంగా వచ్చిన ఫైర్ ఇంజన్
- క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు
నమస్తే శేరిలింగంపల్లి: ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ గురి కావడంతో ప్రయాణంలో ఉన్న ఒక కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మదీనాగూడ ప్రాంతంలో నివసించే ప్రవీణ్, తన తల్లి లక్ష్మితో కలిసి టాటా ఇండిగో కారు (AP 28 AK 0998) లో పని నిమిత్తం చందానగర్ కు వచ్చారు. తిరిగి వెళుతుండగా మంజీరా రహదారిలో చందానగర్ మున్సిపల్ కార్యాలయం వెనకాల వరకు రాగానే కారులో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. వెంటనే వారిద్దరూ కారు దిగడంతో క్షేమంగా బయటపడ్డారు. అయితే వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికి పటాన్ చెరు నుంచి ఫైర్ సిబ్బంది రావడానికి లేట్ కావడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.