బోనాల ఉత్సవాలకు నిధులు మంజూరు

  • దేవాలయాల కమిటీ ప్రతినిధులకు రూ. 25 లక్షల 80 వేలను..చెక్కు రూపేణా అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 90 దేవాలయాలకు మంజూరైన రూ.25 లక్షల 80 వేలను.. చెక్కు రూపేణా దేవాలయాల కమిటీ ప్రతినిధులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలని, ఈ ఉత్సవాలను కన్నుల పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యంతో ప్రతి గుడికి నిధులు మంజూరయ్యేలా కృషి చేశానని చెప్పారు.

ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హాఫిజ్ పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, కూకట్ పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, ఉరిటీ వెంకట్రావు, లక్ష్మారెడ్డి, చాంద్ పాషా, దామోదర్, రాంచందర్ గుడ్ల శ్రీనివాస్, దొంతి శేఖర్, సతీశ్, రఘునాథ్, నర్సింహ సాగర్, గణపతి, తిరుపతి, రాజు, గోపి రమేష్, యాదగిరి, దయనంద్, రవి శంకర్, లక్ష్మీ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here