- కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి బిజెపి ఇన్చార్జి రవికుమార్ యాదవ్, కన్వీనర్ రాఘవేంద్రరావు, కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు, నరేష్, నరేందర్ రెడ్డి, మణి భూషణ్, కేశవ్ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశ శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా దేశాన్ని, రాష్ట్రాలను ఎంతో అద్భుతంగా చూసుకుంటూ సబ్బండ వర్గాల వారికి న్యాయం చేసే విధంగా ప్రధాని మోడీ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ బలపరిచిన చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీ తరఫున భారీ మెజార్టీతో గెలిపించి మరొక్కసారి మోడీ సర్కార్ రావాలని కోరుకుంటూ, విద్యార్థులు, విద్యావేత్తలు, అనుభవజ్ఞులు, శాస్త్రజ్ఞులు, వివిధ రంగాలలో పరిజ్ఞానం ఉన్న మేధావులు కోరుకుంటున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి డివిజన్ ముఖ్య నాయకులు, డివిజన్ పదాధికారులు, మహిళా మోర్చా, యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.