- మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: డాక్టర్ ప్రీతి ఆత్మహత్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో బషీర్ బాగ్ అమ్మవారి టెంపుల్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ర్యాగింగ్ భూతానికి బలయిన గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగినప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, కార్యకర్తలు పాల్గొన్నారు.