నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో , బతుకమ్మ, దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా మహిళలు అధిక సంఖ్య పాల్గొని సద్దుల బతుకమ్మను ఘనంగా సాగనంపారు. సోమవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ హిమబిందు కనోజ్ శిష్య బృందం, జయంతి నారాయణ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. లంభోదర లకుమీకర, బతుకమ్మ పాట, శివుని శిరసుపైన, గణేశా కృతి, దుర్గ తరంగం, అష్టకాలక్ష్మి స్తోత్రం, వరవీనా గీతం, అన్నమాచార్య కీర్తన , తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. సోనా, సిరి, మేఘన, మాధవి, వల్లి, నీలిమ, సృజన, కళ్యాణి , తేజస్వి, రజిత, నిఖిల, చాందిని, భవ్య, సృష్టి, ఆరాధ్య ప్రదర్శించి మెప్పించారు.

