మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్ నివాసానికి బీజేపీ ఛీఫ్‌ బండి సంజ‌య్‌

బీజేపీ ఛీఫ్ బండి సంజ‌య్‌ని ప‌ట్టుబ‌ట్ట‌ల‌తో స‌త్క‌రిస్తున్న మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ మంగ‌ళ‌వారం మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్ నివాసానికి విచ్చేశారు. బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్‌యాద‌వ్‌, కార్పొరేట‌ర్ గంగాధ‌ర‌రెడ్డి, ఇత‌ర బిజెపి నాయ‌కుల‌తో క‌లిసి బండి సంజ‌య్‌ శేరిలింగంప‌ల్లి గోప‌న్‌ప‌ల్లిలోని భిక్ష‌ప‌తియాద‌వ్ నివాసంలో రాత్రి విందులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భిక్ష‌ప‌తియాద‌వ్‌, ర‌వికుమార్‌యాద‌వ్‌లు బండిసంజ‌య్‌ను ప‌ట్టు బ‌ట్ట‌ల‌తో స‌త్క‌రించారు. అనంత‌రం వారు కుటుంబ‌, రాజ‌కీయ అంశాల‌పై ముచ్చ‌టించారు. బండి సంజ‌య్ ఎంతో ఒదిగి ఉండే వ్య‌క్తి అని, ఆయ‌న నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతుంద‌ని రవికుమార్‌యాద‌వ్ అన్నారు.

భిక్ష‌ప‌తియాద‌వ్ నివాసంలో విందులో పాల్గొన్న బండి సంజ‌య్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here