నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పాపి రెడ్డి కాలనీ లో సోమవారం న్యూ లైఫ్ ఫౌండేషన్ నడిపిస్తున్న అనాథాశ్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులకు కొత్త బట్టలు, స్వీట్ ప్యాకెట్స్, క్రాకర్స్, పండ్లను పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తల్లి, తండ్రి ఉండి కూడా పిల్లలు ఇలా అనాథలుగా మారడం చాలా దురదృష్టమని, నేడు దీపావళి పండగ పురస్కరించుకుని వారితో ఒక్క రోజైనా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వారికి చాలా సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని అనాథాశ్రమాలక సేవలు అందిస్తూ వారికి ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, శ్రీనివాస్, రాజేష్, కోటి, కౌశిక్ మొదలగు పాల్గొన్నారు