- అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలందరికీ ‘ప్రపంచ శాంతి’ ఆక్సిజన్ లాంటిదని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ అన్నారు. మదినగూడ లోని త్రివేణి స్కూల్లో ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా మూడో మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సమన్వయ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె వి ఎల్, అధ్యక్ష వర్గ సభ్యులు జి రఘుపాల్ హాజరై ప్రసంగించారు. తిప్పర్తి మహేష్, శోభన్ పల్లె వినయ్ అధ్యక్షతన మహాసభ జరిగింది. ఈ సందర్భంగా కేవీఎల్ మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ పుణ్యమా అని.. దేశం మొత్తం గుత్త పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్లి సామాన్య ప్రజలకు బతుకు బారమై శాంతికి దూరమై జీవనం గడపలేని పరిస్థితిలో వచ్చాయన్నారు. కూరగాయలు పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయన్నారు. వీటిని అరికట్టకుండా ప్రజల మధ్య మతాల చించిపెట్టి అల్లర్లు సృష్టించే వాతావరణం కల్పిస్తున్నారని, ప్రజలకు జీవించే హక్కు హక్కుల రక్షణ, రాజ్యాంగం, స్వామి, సెక్యులరిజం సంరక్షణ కర్తవ్యాలుగా ఏఐపీఎస్ఓ కృషి చేస్తుందన్నారు. ఏఐపీఎస్ఓ మహాసభలు మార్చి 2023 లో చండీగర్లో నిర్వహించబడతాయని, ఈలోగా అన్ని జిల్లాల మహాసభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు రఘుపాల్ మాట్లాడుతూ ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదం యుద్దోన్మాదాన్ని సృష్టిస్తుందని, మీద పెత్తనం కోసం దేశాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. శాంతి ఉద్యమకారులు ఈ బాధలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పొట్టి కారి జగన్ మహాసభకు ముందు ఏఐపీఎస్ పథకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు తిప్పర్తి మహేష్, , పల్లె వినయలు మహాసభల ప్రాముఖ్యత గురించి వివరించారు. పులగాన్ని రవి కిషోర్ కార్యక్రమాల జాబితాను ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చల్లో నాగేష్, బిక్షపతి, రామకృష్ణ, జి లింగం గౌడ్, బిరుదు శ్రీధర్, హిమబిందు పాల్గొన్నారు. నూతన కమిటీ అధ్యక్ష వర్గం: తిప్పర్తి మహేష్, సుదర్శన్ రెడ్డి, పల్లె వినయ్, ప్రశాంత్ సమన్వయ ప్రధానకార్యదర్శి పోల గాని రవి కిషోర్, ప్రధాన కార్యదర్షులు శోభన్, రామకృష్ణ, చందు యాదవ్, జంగయ్య, సోమయ్య, పులి అమృత్ ఎన్నికయ్యారు.