నమస్తే శేరిలింగంపల్లి: చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో పాలకులు విఫలమయ్యారని ఏఐఎఫ్ టిడబ్ల్యూ మహిళా సంఘం విమర్శించింది. ఓంకార్ నగర్ నుంచి మియాపూర్ సెంటర్లో అమరజీవి కామ్రేడ్స్ తాండ్ర కుమార్ విగ్రహం వరకు మహిళలు ర్యాలీగా వచ్చి ఏ ఐఎఫ్ టి డబ్ల్యూ మహిళా సంఘం తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు . ఈ సందర్బంగా ఏ ఐఎఫ్ టి డబ్ల్యూ గ్రేటర్ కార్యదర్శి, కామ్రేడ్ అంగడి పుష్ప మాట్లాడుతూ బంజారాహిల్స్ డిఏవి పబ్లిక్ స్కూల్లో ఎల్ కే జీ బాలికపై ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ రెండు నెలలుగా లైంగికంగా వేధింపులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నాలుగున్నర ఏళ్ళ బాలికపై జరిగిన లైంగిక దాడిని తీవ్రంగా ఖండించారు. మహిళా విద్యాశాఖ మంత్రి, మహిళా కమిషనర్ చైర్మన్ స్పందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మునుగోడు ఓట్ల రేట్లలో మునిగిన ఉన్న మంత్రులు బాధిత కుటుంబాలు గోడును పట్టించుకోవడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐఎఫ్ టిడబ్ల్యూ రాష్ట్ర నాయకులు విమల, లావణ్య, శివాని, సుల్తనా బేగం, లలిత శ్రీలత , విజయ, అమీనా బేగం, ఆప్తర్ బేగం, సుశీల పార్వతి పాల్గొన్నారు.