శేరిలింగంపల్లి నియోజకర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్, తారనగర్, ఇందిరా నగర్, ఫ్రెండ్స్ కాలనీ, కైలాష్ నగర్, కేఎస్ఆర్ ఎన్ క్లేవ్, డిఫెన్స్ కాలనీ, వెంకటేశ్వర నగర్, మారుతి ఎన్ క్లేవ్, న్యూ శంకర్ నగర్, భవానీ నగర్ కాలనీలలో రూ. 6 కోట్ల 69 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం, కల్వర్ట్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని అధికారులకు ఆదేశించారు. అనంతరం శంకుస్తాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు. తారనగర్ కాలనీలో శ్మశాన వాటిక అభివృద్ధి, ఆధునీకరణ పనులకు రూ.1కోటి 50 లక్షలు, ఇందిరానగర్ కాలనీలో రూ.90 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, ఫ్రెండ్స్ కాలనీ, శివాజీ నగర్, కైలాశ్ నగర్, కేఎస్ఆర్ ఎన్ క్లేవ్, డిఫెన్స్ కాలనీలలో రూ.1కోటి 48 లక్షలతో సీసీ రోడ్లు, కైలాశ్ నగర్ కాలనీలో రూ.1కోటి 60 లక్షలతో కల్వర్ట్ నిర్మాణం, వెంకటేశ్వర నగర్, మారుతి ఎన్ క్లేవ్, శివాజీ నగర్ కాలనీలలో రూ.77 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, న్యూ శంకర్ నగర్, భవానీ శంకర్ నగర్ కాలనీలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here