బిజెపి సీనియర్ నాయకులు భీం రావు మృతి

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాధవరం భీం రావు శనివారం తెల్లవారుజామున గుండెపోటు తో మృతి చెందారు. భీం రావు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా పని చేశారు. 2009 సంవత్సరంలో శేరిలింగంపల్లి శాసనసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. భీం రావు కుమారులు అమెరికా నుండి రానున్న నేపథ్యంలో అంత్యక్రియలు 28 వ తేదీన కూకట్ పల్లి లో ని ఆయన నివాసంలో జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here