మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదినం సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్లో ఉన్న డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ సంస్థలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. సొసైటీలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకుడు నరాల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, సొసైటీ నిర్వాహకురాలు చావా అరుణ, అధ్యాపకులు, విద్యార్థులు, గోకుల్ ఫ్లాట్స్ వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.







