హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని మదీనాగూడ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి అయ్యేలా చూడాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మదీనాగూడా టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు బాలరాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు యాదగిరి ముదిరాజ్, ఆంజనేయులు, శేఖర్ యాదవ్, సాయి, అశోక్, మల్లేష్, శివ ముదిరాజ్ పాల్గొన్నారు.






