శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి) డివిజన్ పరిధిలోని శిల్పాగార్డెన్ అసోసియేషన్ ప్రతినిధులు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. బల్దియా ఎన్నికల్లో రెండవ సారి విజయం సాధించిన రాగం నాగేందర్ యాదవ్‌కు శిల్పాగార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు రామారావు, రామ్ కిషోర్‌యాదవ్‌లు ఆదివారం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు ఎక్కడైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. శిల్పాగార్డెన్ వాసుల ప్రేమాభినాలను మరిచిపోనని, కాలనీ అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు రేవంత్, కిరణ్, శ్రీశైలం, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.






