కార్పొరేటర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌కు ఆర్‌బీఆర్ కాంప్లెక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల స‌న్మానం

మియాపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌తి కాల‌నీ, బ‌స్తీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని ఆర్ బీ ఆర్ కాంప్లెక్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన విజయోత్స‌వ‌ ఆత్మీయ సమావేశానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శ‌నివారం హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు ఆయ‌న‌ను స‌న్మానించి అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేసి గెలిపించిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నానన్నారు. ప్ర‌జ‌లు త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ప‌నిచేస్తాన‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అసోసియేషన్ సభ్యులు ప‌ర‌మేష్‌, చంద్ర‌మౌళి, సుబ్బారావు, ప్రేమ్ కుమార్‌, న‌ర‌సింహా రావు, ర‌మేష్‌, ర‌వి, భాస్క‌ర్ గౌడ్‌, ముర‌ళి, చౌద‌రి పాల్గొన్నారు.

కార్పొరేటర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ ను స‌న్మానించి అభినంద‌న‌లు తెలుపుతున్న ఆర్‌బీఆర్ కాంప్లెక్స్ అసోసియేష‌న్ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here