తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్న పూజిత జగదీశ్వర్ గౌడ్ దంపతులు

శేరిలింగంపల్లి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ దంపతులు తారనగర్ లోని శ్రీ తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో రెండు డివిజన్లలోనూ భారీ విజయం సాధించిన పూజిత జగదీశ్వర్ గౌడ్ లు శనివారం తుల్జాభవానీ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృప కటాక్షం, ప్రజల ప్రేమాభిమానాలతో తమ స్థానాలను తిరిగి తెప్పించుకోగలిగామ‌ని అన్నారు. తమ డివిజన్ల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా వారు తెలిపారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పూజ‌లు చేసే వస్త్రాలతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సీనియర్ నాయకులు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, దుర్గం జనార్దన్ గౌడ్, రామ్ చందర్, నర్సింగ్, పండు శీను ముదిరాజ్, సంగమేష్ పాల్గొన్నారు.

తుల్జా భ‌వాని అమ్మ‌వారి పూజ‌లో పాల్గొన్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ దంప‌తులు
తుల్జా భ‌వాని అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here