శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా BHEL OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నివాళులర్పణ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కట్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు సమాజంలో కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తలని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు మండగడ్డ నర్సింగ్ రావు, OBC వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజ్ యాదవ్, ఉపాధ్యక్షుడు అంజనేయులు, ప్రధాన కార్యదర్శి నాగమోహన్, సంయుక్త కార్యదర్శులు జి. పోచయ్య, తుకారాం, గోవర్ధన్, కోశాధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.





