తెల్లాపూర్‌లో వైభవంగా మహా పడిపూజ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెల్లాపూర్ దేవాలయ ప్రాంగణంలో కేశవ గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. డి. రాఘవేంద్రరావు గురుస్వామి, జి. శ్రీధర్ రావు స్వాముల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి సుమారు 2,000 మంది అయ్యప్ప స్వాములతో పాటు పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్, లింగంపల్లి ప్రాంతాలకు చెందిన గురుస్వాములతో పాటు నోముల బుచ్చిరెడ్డి గురుస్వామి, శ్రీశైలం గురుస్వామి, ఎం. బుచ్చిరెడ్డి గురుస్వామి, ప్రభు గురుస్వామి, భానూర్ భూపాల్ రెడ్డి గురుస్వామి, శ్యామ్ రావు గురుస్వామి, బాల్ రెడ్డి గురుస్వామి, రాములు స్వామి, వెంకటేష్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్.ఎన్. రెడ్డి కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

కాగా, మహా పడిపూజ నిర్వహించిన కేశవ గురుస్వామి జన్మదినం సందర్భంగా ఎస్.ఎన్. రెడ్డి స్వామి, బుచ్చిరెడ్డి స్వామి, శ్రీశైలం స్వామి, బాల్ రెడ్డి స్వామి, రాములు స్వామి తదితరులు కేశవ గురుస్వామిని శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేశవ గురుస్వామి భవిష్యత్తులో మరిన్ని మహా పడిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ అయ్యప్ప స్వామి సేవలో కొనసాగాలని ఈ సందర్భంగా భక్తులు ఆకాంక్షించారు. గురుస్వామి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here