ఇందిరా గాంధీ సేవలు దేశానికి స్ఫూర్తిదాయకం: వి.జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరా గాంధీ జయంతి వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని, ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతతో పాటు దేశ అభివృద్ధి, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ విశేష కృషి చేశారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో నివసించే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్య పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్, వీరేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, కనకమామిడి నరేందర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు భరత్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు నగేష్ నాయక్, భాష్పక యాదగిరి, కావూరి ప్రసాద్, కట్ల శేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, యలమంచి ఉదయ్ కిరణ్, శివ కుమార్, రాజేష్, ప్రసాద్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి, శంకర్ గౌడ్, వెంకటేష్, జగన్, బ్రహ్మానంద రెడ్డి, స్వామి, చెన్నై సాగర్, సురేష్ సాగర్, సందీప్ రెడ్డి, గోపాల్ నాయక్, సామ్రాట్, సంతోష్ పాల్గొన్నారు. అలాగే మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పన ఏకాంత్ గౌడ్, శ్రీజ రెడ్డి, శశిరేఖ, అనిత‌ గౌడ్, జయ, శాంత, నాజియా, రిజ్వాన్, రమేష్ నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీను నాయక్, సంజయ్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు చంద్రమౌళి, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here