శేరిలింగంపల్లిలో 130 కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అత్యవసర వైద్య చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 130 మంది బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.31.59 ల‌క్ష‌ల‌ విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకు CMRF చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. 130 మంది బాధిత కుటుంబాలకు రూ.31.59 లక్షల ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలుస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటున్నారని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్థోమత లేక వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించి ఆర్థిక భరోసా కల్పిస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. CMRF ద్వారా వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, కోనేరు ప్రసాద్, మరేళ్ల శ్రీనివాస్, పోతుల రాజేందర్, ఎండీ ఇబ్రహీం, యెల్లం నాయుడు, కావూరి అనిల్, మంజుల, లక్ష్మీ అష్రఫ్, సలావుద్దిన్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here