మియాపూర్‌లో పారిశుధ్య పనుల తనిఖీ.. వన్ డే వన్ వార్డ్ కార్యక్రమం నిర్వహణ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్ 48 పరిధిలోని అపర్ణ హిల్ పార్క్ రోడ్డులో పారిశుధ్య పనులను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. అనంతరం KSR ఎన్‌క్లేవ్‌లో స్థానిక RWA ప్రతినిధులు, EE, DYEE, VO, UBD మేనేజర్, ఇతర అధికారుల భాగస్వామ్యంతో వన్ డే వన్ వార్డ్ (ODOW) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో పారిశుధ్య నిర్వహణ, స్థానిక సమస్యలు, పౌర సేవలపై సమీక్షించారు.

అనంతరం దీప్తి శ్రీనగర్ వార్డులో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వివిధ అభివృద్ధి పనుల పురోగతిని డిప్యూటీ కమిషనర్ సమీక్షించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో స్థానిక RWA ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here