శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ అసోసియేషన్ సభ్యులు మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లగండ్లలోని ఆయన స్వగృహానికి వెళ్లి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, సంఘం తరఫున జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్‌లో రాగం నాగేందర్ యాదవ్ చేపడుతున్న అభివృద్ధి పనులను అభినందించారు. ముఖ్యంగా గోపినగర్‌లో తన సొంత ఖర్చులతో నాయి బ్రాహ్మణ సంఘానికి కమ్యూనిటీ భవనాన్ని నిర్మించి అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. సంఘాన్ని గుర్తించి, అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ సంఘం ఆయనకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

అనంతరం రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గోపినగర్‌లో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని సంఘ సమావేశాలు, అధికారిక కార్యక్రమాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, భవిష్యత్తులోనూ సంఘ సభ్యులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షుడు సాయన్న, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, ఉపాధ్యక్షుడు పరుశురాం, కోశాధికారి బీదర్ కోట శేఖర్, చైర్మన్ రవికుమార్, వైస్ చైర్మన్ మాణిక్ ప్రభు, గౌరవ అధ్యక్షుడు భాస్కర్, మైలారం సురేష్, ముఖ్య సలహాదారులు ముత్యాల జనార్ధన్, దైవపూజ దశరథ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సత్యం, మల్లేష్ కుమార్, పగడాల సాయికుమార్, ప్రచార కార్యదర్శులు ఆలిండ్ బాల్‌రాజ్, కె.కె. సత్తి రాజు, జాయింట్ సెక్రటరీలు జగదీష్, భిక్షపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నరేష్, వెంకటేష్, కార్యదర్శులు విజయ్ కుమార్, విఠల్, వెంకటేష్ తాండ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు బల్వంత్ కుమార్, అనిల్ కుమార్, ఆనంద్, మల్లేష్, మహేందర్, రాజు, దేవేందర్, శ్రీనివాస్, విజయ్, సతీష్‌తో పాటు సంఘ కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.





