శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఐఎన్‌టీయూసీ (INTUC) 73వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జోనల్ కార్యాలయంతోపాటు బాలాజీనగర్, తారానగర్ సెక్షన్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పునాస మామిడి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు, కూకట్‌పల్లి డివిజన్ సెక్రటరీ ఎస్. రమేష్, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఆర్. యాదయ్య, డివిజన్ సెక్రటరీ రాజేందర్ నాయక్, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ ఏ. రాజేందర్, డివిజన్ సెక్రటరీ వై.వి. రామ్ రెడ్డి, గచ్చిబౌలి ట్రెజరర్ భరత్ భూషణ్, ఇబ్రహీంబాగ్ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, ట్రెజరర్ మహేష్‌తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్మికులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






