28 మంది లబ్ధిదారులకు రూ.28.03 లక్షల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల‌ పంపిణీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.28,03,248 ఆర్థిక సహాయాన్ని 28 మంది లబ్ధిదారులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. కూకట్‌పల్లి మండల పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర నగర్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు వివేకానంద నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ.28,03,248 విలువైన చెక్కులను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు.

నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే మానవతా దృక్పథంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు సంతోషంగా జరగడానికి ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here